Pithapuram: నన్ను, నా సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు - పవన్ కళ్యాణ్

గత రెండు రోజుల నుండి జనసేన పార్టీ అధినేత ఎన్నికల ప్రచారం లో భాగంగా పిఠాపురం లోనే నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయనకీ జ్వరం రావడం తో హైదరాబాద్ కి పయనమై మళ్ళీ నేడు మధ్యాహ్నం తిరిగి పిఠాపురం చేరుకున్నారు.

Pithapuram: నన్ను, నా సెక్యూరిటీ వాళ్లను బ్లేడ్లతో కట్ చేస్తున్నారు - పవన్ కళ్యాణ్
X

న్యూస్ లైన్, పిఠాపురం: గత రెండు రోజుల నుండి జనసేన పార్టీ అధినేత ఎన్నికల ప్రచారం లో భాగంగా పిఠాపురం లోనే నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయనకీ జ్వరం రావడం తో హైదరాబాద్ కి పయనమై మళ్ళీ నేడు మధ్యాహ్నం తిరిగి పిఠాపురం చేరుకున్నారు. నేడు ఆయన సమక్షం లో టీడీపీ అవనిగడ్డ, పాలకొండ మాజీ ఎమ్మెల్యేలు పార్టీ లో చేరారు. అలాగే నేడు పిఠాపురం కి చెందిన పలువురు ఎంపీటీసీలు, లాయర్లు, డాక్టర్లు కూడా పవన్ కళ్యాణ్ సమక్షం లో భారీ ఎత్తున జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ' పిఠాపురం లో రెండు లక్షలకు పైగా జనాలు ఉన్నారు. నాకు వాళ్లందరితో ఫోటోలు దిగాలని ఉంది. కచ్చితంగా త్వరలోనే మీ అందరినీ కలుస్తాను. రోజుకి 200 ఫోటోలు ఇస్తాను. అయితే మీరంతా కూడా సెక్యూరిటీ కి సహకరించాలి. ఎందుకంటే నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి.' అంటూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.

Tags:
Next Story
Share it