Pawan Kalyan: చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు నో పర్మిషన్!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన్ని.. తెల్లవారుజామున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో సీ‌ఐ‌డీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో భాగంగా ఆయనను విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్

Pawan Kalyan: చంద్రబాబును కలిసేందుకు పవన్‌కు నో పర్మిషన్!
X

న్యూస్‌లైన్, డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. నంద్యాల పర్యటనలో ఉన్న ఆయన్ని.. తెల్లవారుజామున స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో సీ‌ఐ‌డీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో భాగంగా ఆయనను విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

విజయవాడలో చంద్రబాబును కలవాలని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతి ఇవ్వొద్దంటూ గన్నవరం విమానాశ్రయం అధికారులను ఏపీ పోలీసులు కోరారు. పోలీసులను రిక్వెస్ట్ చేసిన ఆయనకు అనుమతిని నిరాకరించారు. మరోవైపు కోర్టు వద్ద మార్గంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 200 మంది పోలీసులను కోర్టు ప్రాంగణంలో మోహరించారు. కోర్టు వద్ద ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it