pawan kalyan: టీడీపీతో పొత్తు కనీసం 10 ఏళ్లు ఉండాలి !

ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పని చేయాలి.. టీడీపీతో పొత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా మరోసారి ఏపీ

pawan kalyan: టీడీపీతో పొత్తు కనీసం 10 ఏళ్లు ఉండాలి !
X

pawan kalyan: ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పని చేయాలి.. టీడీపీతో పొత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలో కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.... విభజన వల్ల, జగన్ అరాచకపాలన వల్ల ఎంతో నష్టం జరిగిందని అన్నారు. ప్రకాశం జిల్లాలో గనులు, తవ్వుకెళ్తున్నారనే తప్ప.... ప్రజలకు మంచి చేయడం లేదన్నారు.

చిన్నప్పుడు ఫ్లోరోసిస్ కారణంగా తాము కనిగిరి నుంచి వెళ్లిపోయామని, ఆ సమస్య ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పొత్తులో మనం ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర కూడా వైసిపి విముక్త ప్రాంతంగా మారాలన్నారు. రూ. 150 కోట్లు ఖర్చు పెట్టే సత్తా ఉన్న ఎమ్మెల్యేలు ప్రకాశం జిల్లాలో ఉన్నారని....కానీ ప్రజలు మాత్రం పొట్ట చేత పట్టుకొని వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:
Next Story
Share it