Pawan Kalyan: నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ ఫోన్

ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌ చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. నిన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసి..రిమాండ్‌ కు పంపారు అధికారులు. ఈ తరునంలోనే....నారా లోకేశ్‌కు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఫోన్‌ చేశారు. నారా లోకేశ్‌కు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పారు పవన్ కళ్యాణ్. చంద్

Pawan Kalyan: నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ ఫోన్
X

Pawan Kalayan : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్‌ చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. నిన్న స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసి..రిమాండ్‌ కు పంపారు అధికారులు. ఈ తరునంలోనే....నారా లోకేశ్‌కు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఫోన్‌ చేశారు. నారా లోకేశ్‌కు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని చెప్పారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో జగన్ నియంత పాలనపై కలిసి పోరాడుదాం అని లోకేశ్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఇది ఇలా ఉండగా, నేడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బంద్. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది టీడీపీ. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు, రిమాండుకు నిరసనగా టీడీపీ నేడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బంద్ నిర్వహించనుండగా దీనికి జనసేన, సీపీఐ, ఎమ్మార్పీఎస్ మద్దతు ప్రకటించాయి. ఇక చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ పిలుపు మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. అటు ప్రైవేటు విద్యాసంస్థలు, పలు వ్యాపార సముదాయాలకు సెలవు ప్రకటించేశాయి యాజమాన్యాలు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులను బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు.

Tags:
Next Story
Share it