Vizag : విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్..పోటీ చేసే నాయకులతో భేటీ!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలం నుండి వారాహి విజయ యాత్ర ని ఆపేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కీలక సమయం లో పవన్ కళ్యాణ్ ఇలా సైలెంట్ అయ్యాడేంటి అని అభిమానులు జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడింది.

Vizag : విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్..పోటీ చేసే నాయకులతో భేటీ!
X

న్యూస్ లైన్, వైజాగ్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలం నుండి వారాహి విజయ యాత్ర ని ఆపేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కీలక సమయం లో పవన్ కళ్యాణ్ ఇలా సైలెంట్ అయ్యాడేంటి అని అభిమానులు జుట్టు పీక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి అయ్యోమయ్యం లో ఉన్న పరిస్థితులలో పవన్ కళ్యాణ్ అభిమానులకు కాస్త ఊరటని కలిగించే వార్త. ఈరోజు ఆయన వైజాగ్ కి చేరుకున్నాడు. అక్కడ ముఖ్య నాయకులతో భేటీ అవ్వడం కోసం, ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఆయన చర్చలు జరపబోతున్నారు.

వైజాగ్ కి చేరుకున్న వెంటనే కొణతాల సీతారాం తో భేటీ అయిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వెంటనే హోటల్ నోవెటల్ కి చేరుకున్నారు. రేపు వైజాగ్, ఉత్తరాంధ్ర లో పోటీ చెయ్యబొయ్యే జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి,అనంతరం ఆయన మధ్యాహ్నం నుండి రాజమండ్రి కి పయనం అవుతాడు. ఆ తర్వాత భీమవరం కి చేరుకొని, 22 వ తారీఖున ఢిల్లీ కి పయనం అవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటుగా చంద్రబాబు కూడా ఢిల్లీ కి వచ్చే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ పెద్దలతో చివరిసారిగా చర్చలు జరిపి, ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా బీజేపీ తో పొట్టుని ప్రకటించబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనుంది.

Tags:
Next Story
Share it