Yalamanchili : రాజకీయ సన్యాసం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం లో భాగంగా నేడు యలమంచిలి లో వారాహి విజయ భేరి సభ ని నిర్వహించారు.

Yalamanchili : రాజకీయ సన్యాసం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన!
X

న్యూస్ లైన్, యలమంచిలి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం లో భాగంగా నేడు యలమంచిలి లో వారాహి విజయ భేరి సభ ని నిర్వహించారు. ఉదయం 12 గంటలకు మండపేట లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులకు ప్రచారం చేసిన ఆయన, సాయంత్రం 5 గంటలకు యలమంచిలి లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్, అలాగే బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'మే డే సందర్భంగా చెప్తున్నాను. మేము ఇచ్చిన మేనిఫెస్టో లో అంశాలను నెరవేర్చకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను' అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. 2014 ఎన్నికల సమయం లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నో హామీలు ఇచ్చి గాలికి వదిలేసారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ అలా చూస్తూ ఉండిపోయారు కానీ, హామీలను నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వెయ్యలేదు. ఇప్పుడు మేనిఫెస్టో లో ఎన్నో అసాధ్యమైన హామీలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇచ్చారు. మరి గెలిచినా తర్వాత అవి నెరవేర్చకపోతే పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం చేస్తారో లేదో చూడాలి.

Tags:
Next Story
Share it