వాలంటీర్లు దండు పాళ్యం బ్యాచ్‌లా తయారయ్యింది.. పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

వాలంటీర్ వ్యవస్థపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వాలంటీర్ చేతిలో హత్య చేయబడ్డ పెందుర్తి వాసి వరలక్ష్మి కుటుంబాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. కత్తులతో గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్ వాలంటీర్లకు తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశ

వాలంటీర్లు దండు పాళ్యం బ్యాచ్‌లా తయారయ్యింది.. పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

న్యూస్‌లైన్, డెస్క్: వాలంటీర్ వ్యవస్థపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మీ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కత్తులతో గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్‌కి వాలంటీర్లకు తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఒంటరి మహిళ ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని విమర్శించారు. పాస్ పోర్టు కావాలంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరమని, కానీ వాలంటీర్ల నియామకంలో అలాంటి పద్ధతి లేవని అన్నారు. తనకు విధించిన ఆంక్షలు వాలంటీర్లకు విధిస్తే అలాంటి అరాచకాలు ఉండవన్నారు. నవరత్నాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యామని,ప్రజల ప్రాణాలు తీసేస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని అన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఉత్తరంధ్రా, విశాఖ నుంచే ఎక్కువగా జరుగుతుందన్నారు. అన్నింటికి జగన్‌ను తప్పుబట్టలేమని, వ్యవస్థలో లోపలు ఉంటే సరిదిద్దుకోవాలన్నారు పవన్ కళ్యాణ్.

Tags:
Next Story
Share it