Janasena : 3 రోజులు కూడా జనాల్లో ఉండలేని పవన్..జగన్ ని పాతాళంలోకి తొక్కుతాడట!

పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు అసలు సంబంధం ఉండదు అనేది వాస్తవం. గడిచిన పదేళ్లలో ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఇది అందరికీ అర్థం అవుతుంది. తాట

Janasena : 3 రోజులు కూడా జనాల్లో ఉండలేని పవన్..జగన్ ని పాతాళంలోకి తొక్కుతాడట!
X

న్యూస్ లైన్ డెస్క్: పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు, చేసే చేష్టలకు అసలు సంబంధం ఉండదు అనేది వాస్తవం. గడిచిన పదేళ్లలో ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే ఇది అందరికీ అర్థం అవుతుంది. తాట తీస్తా, తోలు తీస్తా అంటూ మాట్లాడే పవన్ కళ్యాణ్, కనీసం కోడిగుడ్డు మీద బొచ్చు కూడా పీకలేని రాజకీయాలు చేస్తూ కమెడియన్ గా మిగిలిపోతున్నారు. సంవత్సరం మొత్తం షూటింగ్స్ చేసుకుంటూ, ఎన్నికల చివరి పది రోజులు జనాల్లో తిరిగి నాకు ఓట్లు వేసేయాలి అంటారు. ఒకవేళ అభిమానులు ఓట్లు వెయ్యకపోతే మీ వల్లే నేను ఓడిపోయాను లాంటి కామెంట్స్ బహిరంగంగా చేస్తారు. పట్టుమని పది రోజులు కూడా జనాల్లో ఉండే సత్తా లేని మనిషి, 150 కి పైగా సీట్లు సాధించిన జగన్ ని పాతాళం లోకి తొక్కేస్తాను వంటి వ్యాఖ్యలు చెయ్యడం అభిమానులకు సైతం నవ్వు రప్పిస్తున్నాయి.

కేవలం 21 స్థానాల్లో కూడా అవ్యర్థులను నిలబెట్టుకోలేని సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ కి ఇంతటి ప్రగల్భాలు పలకాల్సిన అవసరం ఉందా అని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇక రెండు రోజులు జనాల్లో తిరిగితే వారం రోజులు జ్వరం వచ్చి ఇంట్లో పడుకునే పవన్ కళ్యాణ్ కి సంవత్సరాల పాటు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్ ని వేలెత్తి చూపే అర్హత ఉందా అని ఆయన అభిమానులు సైతం అడుగుతున్నారు. ఉదాహరణకి ఇటీవలే ఆయన పిఠాపురం నుండి ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. ప్రచారం మొదలెట్టి మూడు రోజులు పర్యటించగా, వైరల్ ఫీవర్ సోకి ఇప్పుడు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది. 24 గంటలు ఏసీ లో కూర్చునే పవన్ కళ్యాణ్, ఒక్కసారిగా ఎండల్లో తిరిగితే సొమ్మసిల్లి పడిపోవడం సర్వసాధారణమే. అదే మొదటి నుండి జనాల్లో ఉండడం అలవాటు చేసుకుంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కాదేమో. కాబట్టి జగన్ ని పాతాళంలోకి తొక్కేస్తా, తాట తీస్తా లాంటి వ్యాఖ్యలు చేసేబదులు, పవన్ కళ్యాణ్ ని ముందు జనాల్లో ఉండడం అలవాటు చేసుకోమని అభిమానులు సలహా ఇస్తున్నారు.

Tags:
Next Story
Share it