Janasena : భీమవరంలో కొత్త ఇల్లు తీసుకున్న పవన్ కళ్యాణ్!

ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలతో వారు జనాల్లోకి దూసుకుపోతున్నారు. ఇప్పటికే జగన్ 'సిద్ధం' సభలతో రాష్ట్ర రాజకీయాల్లో అలజడి పుట్టిస్తున్నాడు. మరోపక్క చంద్రబాబు నాయుడు 'రా..కదలిరా' పేరుతో వివిధ నియోజకవర్గాల్లో ప్రతీరోజు సభలను నిర్వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతుకి వచ్చేసింది.

Janasena : భీమవరంలో కొత్త ఇల్లు తీసుకున్న పవన్ కళ్యాణ్!
X

న్యూస్ లైన్, భీమవరం : ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకపోయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలతో వారు జనాల్లోకి దూసుకుపోతున్నారు. ఇప్పటికే జగన్ 'సిద్ధం' సభలతో రాష్ట్ర రాజకీయాల్లో అలజడి పుట్టిస్తున్నాడు. మరోపక్క చంద్రబాబు నాయుడు 'రా..కదలిరా' పేరుతో వివిధ నియోజకవర్గాల్లో ప్రతీరోజు సభలను నిర్వహిస్తున్నాడు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతుకి వచ్చేసింది. అతి త్వరలోనే ఆయన కూడా ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నాడు. టీడీపీ - జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినప్పటికీ, మధ్యలో బీజేపీ పార్టీ కూడా పొట్టులోకి రావడం తో, వాళ్లకు సీట్లు సర్దుబాటు చేసే ప్రక్రియలో కాస్త ఆలస్యం అయ్యిందట. నిన్న విశాఖకు చేరుకొని పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్, ఈరోజు రాజమండ్రి కి బయలుదేరాడు. అనంతరం భీమవరం కి చేరుకొని అక్కడి నాయకులతో సుదీర్ఘ చర్చలు జరపబోతున్నాడు.

ఈసారి కూడా ఆయన పోటీ చేయబోయేది ఆ స్థానం నుండే అని దాదాపుగా ఖరారు అయిపోయింది. భీమవరం లో ఆయన ఉండే ఇల్లుని కూడా ఏర్పాటు చెయ్యబోతున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ నాయకులూ ఆ పనిలోనే ఉన్నారట. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిస్తే, హైదరాబాద్ నుండి తన బేస్ మొత్తాన్ని పూర్తిగా ఇక్కడికి మార్చేసుకోబోతున్నాడట. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఆయన సోదరుడు నాగబాబు కూడా అనకాపల్లి లో ఇల్లు తీసుకున్నాడు. ఇక నుండి ఆయన అక్కడే ఉంటాడట. రాబొయ్యే ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి స్థానం నుండి పోటీ చెయ్యబోతున్నాడు. అయితే దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన ఐదేళ్ళలో అన్నదమ్ములకు భీమవరం, అనకాపల్లి లో ఇల్లులు తీసుకోవాలనే ఆలోచన రాలేదా?, ఎన్నికలు వచేస్తున్నాయంటే ఎందుకు ఇలా నాటకాలు ఆడుతున్నారు. జనాలు ఇలాంటివి అర్థం చేసుకోరు అనుకుంటున్నారా అంటూ ట్రోల్ల్స్ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it