Pawan Kalyan: జీతాలు తీసుకొని వారు వాలంటీర్లు.. పవన్ కీలక వ్యాఖ్యలు!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఇవాళ తాడేపల్లి గూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదని అన్నారు.

Pawan Kalyan: జీతాలు తీసుకొని వారు వాలంటీర్లు.. పవన్ కీలక వ్యాఖ్యలు!
X

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఇవాళ తాడేపల్లి గూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఒక్క మాట కూడా అనలేదని అన్నారు. జగన్ మద్దతుదారులు మహిళ పట్ల నీచంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

జగన్ భార్య గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదని, అలాంటిది జనసేన మహిళల పట్ల వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత కాలంగా జగన్ దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఆయనకు అసలు సంస్కారం లేదని విమర్శించారు. మరోవైపు.. వాలంటీర్లు అందరూ వాలంటీర్లు తనకు సోదరులతో సమానులన్నారు. వారిని ఇబ్బంది పెట్టడం కాదని, పొట్ట కొట్టడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

అందరి గురించి చెడ్డగా చెప్పడం లేదని, కొందరు మాత్రమే ఇటువంటి దారుణాలు జరగడానికి కారణం అవుతున్నారని చెప్పారు.మామూలుగా వాలంటీర్లు అంటే ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పని చేయాలన్నారు. కానీ వారికి నెలకు 5 వేలు చొప్పున జీతంగా చెల్లిస్తున్నారని అన్నారు. అయితే అప్పుడు వాలంటీర్లు ఎలా వాడుతారు అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

Tags:
Next Story
Share it