Pawan Kalyan: పవన్‌పై పోటీగా ముద్రగడ?

ఏపీ రాజకీయాలలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఏ నేత ఎప్పుడు పార్టీ మారుతున్నాడు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైసీపీ పార్టీని ఓడించేందుకు జనసేన,

Pawan Kalyan: పవన్‌పై పోటీగా ముద్రగడ?
X

Pawan Kalyan vs mudragada: ఏపీ రాజకీయాలలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ఏ నేత ఎప్పుడు పార్టీ మారుతున్నాడు అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైసీపీ పార్టీని ఓడించేందుకు జనసేన, తెలుగుదేశం పార్టీ చాలా కుట్రలు చేస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను వాడుకొని పావులు కదుపుతున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు వైసీపీ పార్టీ ప్లాన్ వేస్తోంది. నిజంగా పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ నేత ముద్రగడను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ జనసేన పార్టీలోకి వెళ్లకపోతే అతన్ని వైసీపీ పార్టీలోకి తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పై పోటీకి బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కాపు ఓట్లు కీలకమైన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడే పవన్ కళ్యాణ్ ను ఓడించాలని ముద్రగడ ను బర్లోకి దింపుతున్నారట సీఎం జగన్మోహన్ రెడ్డి. నిజంగానే వైసీపీ పార్టీలోకి ముద్రగడ వస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్.. ఖాయమంటున్నారు.

Tags:
Next Story
Share it