Pensions Effect : పెన్షన్స్ ఎఫెక్ట్..దారుణంగా పడిపోయిన కూటమి గ్రాఫ్!

రాష్ట్రంలో ఇప్పుడు వాలంటీర్స్ విలువ ఎలాంటిదో అందరికీ అర్థం అవుతుంది. ముఖ్యంగా వాలంటీర్ల విషయం లో తెగ కామెడీ చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారికి అదే వాలంటీర్లు వారి రాజకీయ జీవితానికి మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది.

Pensions Effect : పెన్షన్స్ ఎఫెక్ట్..దారుణంగా పడిపోయిన కూటమి గ్రాఫ్!
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో ఇప్పుడు వాలంటీర్స్ విలువ ఎలాంటిదో అందరికీ అర్థం అవుతుంది. ముఖ్యంగా వాలంటీర్ల విషయం లో తెగ కామెడీ చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారికి అదే వాలంటీర్లు వారి రాజకీయ జీవితానికి మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. ప్రతీ నెల 1 వ తేదీ అవ్వగానే ఇంటింటికి చేరి అవ్వాతాతలకు పెన్షన్స్ ని అందచేసే వాలంటీర్లు చంద్రబాబు హై కోర్టు లో కేసు వెయ్యడం వల్ల ఎన్నికల సంఘం ఆపేసింది. దీంతో నేడు వృద్దులు నిటారు ఎండల్లో క్యూ లైన్స్ లో గంటల తరబడి నిల్చొని పెన్షన్స్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం మొత్తం చంద్రబాబే. ఈ ఎండల్లో క్యూలైన్స్ లో వృద్దులు నిలబడలేక వడదెబ్బతో ప్రాణాలను విడిస్తే ఆ పాపం చంద్రబాబుదే. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు చంద్రబాబు ని, పవన్ కళ్యాణ్ ని బండ బూతులు తిట్టుకోవడం మొదలు పెట్టారు. దీని ప్రభావం మామూలుగా లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లేటెస్ట్ గా వచ్చిన సర్వే రిపోర్ట్స్ కూటమి కి ఎంతో ప్రతికూలంగా ఉంది.

175 స్థానాల్లో కనీసం 30 స్థానాలు గెలవడం కూడా కష్టమే అని అంటున్నారు. కేవలం పెన్షన్స్ మాత్రమే కాకుండా, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి రేషన్ సామాన్లు ఇంటి వద్దే డోర్ డెలివరీ చేయించే బృహత్తర కార్యక్రమం కూడా చంద్రబాబు కేసు వెయ్యడం వల్ల ఆగింది. దీంతో మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు కూడా చంద్రబాబు ని బాగా తిట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కూటమి దే విజయం అని డప్పు కొట్టిన కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు కూడా నేడు చేతులెత్తేశాయి. మరో పక్క పవన్ కళ్యాణ్ ప్రసంగాలతో ప్రజలను మభ్య పెట్టాలని టీడీపీ చూస్తున్నప్పటికీ, ఆయన చుర్రుగ్గా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం లేదు. మూడు రోజుల పాటు పిఠాపురం లో పర్యటించిన పవన్ కళ్యాణ్ కి హై ఫీవర్ రావడం తో ఈరోజు తెనాలి నుండి విరామం లేకుండా సాగాల్సిన ఎన్నికల ప్రచారం రెండు రోజుల పాటు వాయిదా పడింది. మరోపక్క చంద్రబాబు నాయుడు పెన్షన్స్ విషయం లో ప్రభుత్వానిదే తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా జనాలు పట్టించుకోవడం లేదు. దీంతో కూటమికి రాబొయ్యే ఎన్నికలలో ఘోర పరాభవం తప్పేటట్టు లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:
Next Story
Share it