Amaravati : ఏపీ హైకోర్టులో పిల్.. మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి

తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు విడగొడుతూ, హైదరాబాద్ ని పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ ప్రతిపాదన చేసింది. పదేళ్లు గడిచిపోయాయి. దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని లేదు.

Amaravati : ఏపీ హైకోర్టులో పిల్.. మరో పదేండ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి
X

న్యూస్ లైన్, అమరావతి : తెలుగు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండు విడగొడుతూ, హైదరాబాద్ ని పదేళ్ల వరకు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ ప్రతిపాదన చేసింది. పదేళ్లు గడిచిపోయాయి. దురదృష్టం కొద్దీ ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని లేదు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నప్పుడు అమరావతి అంటూ పెద్ద హంగామా చేసారు కానీ, ఐదేళ్ళలో ఎలాంటి అభివృద్ధి చెయ్యలేదు. ఆ తర్వాత వైసీపీ వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన రావడం, అదే సమయం లో కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగిపోవడం వంటి కారణాల వల్ల రాజధాని నిర్మాణం సరిగా జరగలేదు. దీంతో కొంతమంది ఏపీ మంత్రులు మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని గా ప్రకటించాలి అంటూ మీడియా ముందు తమ అభిప్రాయాన్ని వ్యక్తం పరిచారు. ఈ మాటలకు బలం చేకూరుస్తూ ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ఇక దీనిపై హై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:
Next Story
Share it