YCP : వైసీపీకి గుడ్ బై చెప్పనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ?

వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అయ్యారట పిల్లి సుభాష్ చంద్రబోస్. త్వరలోనే జనసేన గూటికి వెళ్లేందుకు

YCP : వైసీపీకి గుడ్ బై చెప్పనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ?
X

వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అయ్యారట పిల్లి సుభాష్ చంద్రబోస్. త్వరలోనే జనసేన గూటికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారట పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఆలోచన ఉన్నారట పిల్లి సుభాష్ చంద్రబోస్. ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌ను సైతం ఖాళీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట.

ఈ నేపథ్యంలోనే.. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్య ప్రకాశ్ కు జనసేన టికెట్ ఖరారు అని ప్రచారం జరుగుతోంది. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలో పిల్లి సూర్య ప్రకాశ్‌ ఉండనున్నారని సమాచారం. ఈ మేరకు జనసేనలోకి వెళ్ళేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రామచంద్రాపురం నియోజకవర్గం టికెట్ వచ్చే అవకాశం లేదని తేలటంతో పార్టీ వీడాలని పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం అందుతోంది.

Tags:
Next Story
Share it