Chilakaluripeta : 17 న జరగబొయ్యే టీడీపీ - జనసేన మహాసభకు రానున్న ప్రధాని మోడీ!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ-జనసేన- బీజేపీ పార్టీల పొత్తు గురించే ఎక్కడ చూసినా చర్చ. మరో పక్క సీఎం జగన్ ఇలాంటి పొత్తులతో ఎలాంటి సంబంధం లేకుండా, చాలా ప్రశాంతం గా విడతల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసుకుంటూ ముందుకు పోతున్నారు.

Chilakaluripeta : 17 న జరగబొయ్యే టీడీపీ - జనసేన మహాసభకు రానున్న ప్రధాని మోడీ!
X

న్యూస్ లైన్, చిలకలూరిపేట: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ-జనసేన- బీజేపీ పార్టీల పొత్తు గురించే ఎక్కడ చూసినా చర్చ. మరో పక్క సీఎం జగన్ ఇలాంటి పొత్తులతో ఎలాంటి సంబంధం లేకుండా, చాలా ప్రశాంతం గా విడతల వారీగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు టీడీపీ జనసేన పార్టీలు మాత్రమే కలిసి నడిచాయి. ఇప్పుడు జగన్ ని ఓడించేందుకు ఈ రెండు పార్టీలతో బీజేపీ కూడా జత కట్టింది. పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో, 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధం అయ్యింది. అయితే ఈ నెల 17 వ తారీఖున చిలకలూరిపేటలో టీడీపీ - జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సభ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి అధికారం లోకి వస్తే ఆంధ్ర కి ఏమి చేయబోతున్నారో చెప్పే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు ఈ సభతో మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Tags:
Next Story
Share it