Pithapuram : పిఠాపురం లో పవన్ కి షాక్..'వారాహి' కి అనుమతి నిరాకరణ!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

Pithapuram : పిఠాపురం లో పవన్ కి షాక్..వారాహి కి అనుమతి నిరాకరణ!
X

న్యూస్ లైన్, పిఠాపురం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. నేడు ఉదయం ఆయన పిఠాపురం కి చేరుకొని,అనంతరం ర్యాలీగా వెళ్తూ టీడీపీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యులు వర్మ ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారి ఇంట్లోనే భోజన కార్యక్రమాలు పూర్తి చేసి హోటల్ కి పయనమయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు జరగబోయే సభకు 'వారాహి' వాహనం కి పోలీసులు అనుమతిని నిరాకరించారు. నిన్న రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి పిఠాపురం లో భారీ వాహనములకు అనుమతి లేదని చెప్పడం తో వారాహి కి బ్రేక్ పడింది. దీంతో వారాహి కి ప్రత్యామ్నాయం గా వేరే బండి మీద స్టేజిని ఏర్పాటు చేసారు. అందులో నుండే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. అయితే వారాహి వాహనం కి కేవలం పిఠాపురం లో ఒక్కటే అనుమతి లేదా, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా అనుమతించరా అనేది తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it