Ys Sharmila : షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

వైఎస్ షర్మిల (Ys Sharmila ) కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ సమీపంలోని ఎనికే పాడు వద్ద వైఎస్‌ షర్మిల వెళ్లే వాహనాలను మళ్లించారు పోలీసులు. అయితే..

Ys Sharmila : షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు
X

Ys Sharmila : వైఎస్ షర్మిల (Ys Sharmila ) కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ సమీపంలోని ఎనికే పాడు వద్ద వైఎస్‌ షర్మిల వెళ్లే వాహనాలను మళ్లించారు పోలీసులు. అయితే.. షర్మిల (Ys Sharmila ) వాహనాలను డైవర్ట్ చేసినందుకు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ ఇతర కాంగ్రెస్ శ్రేణులు.

అయితే...విజయవాడలో తన కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకోవడంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. ర్యాలీకి అనుమతి ఉన్నా కాన్వాయ్ ని ఆపడానికి ప్రయత్నించారని ఫైర్ అయ్యారు. 'ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకునే సమయంలో నా కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అంటే కాంగ్రెస్ ని చూసి ఈ ప్రభుత్వం భయపడుతోంది. భయపడుతున్నారా సార్?' అని ప్రశ్నించారు. తమ కార్యకర్తల్ని అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. అవసరమైతే జైలుకైనా వెళ్తామని ఘాటుగా స్పందించారు వైఎస్ షర్మిల (Ys Sharmila ).

Tags:
Next Story
Share it