Posani : పవన్ కల్యాణ్ ఓ పిచ్చోడు...!

నసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై వైసీపీ నేత పోసాని కృష్ణమూరళి (Posani Krishna Murali) హాట్ కామెంట్ చేశారు. సినిమా ఆర్టిస్టు కాబట్టే పవన్ కల్యాణ్ ను చూసేందుకు జనం వస్తున్నారన్నారు. వచ్చే జనం అంతా ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే అన్నారు.

Posani : పవన్ కల్యాణ్ ఓ పిచ్చోడు...!
X

న్యూస్ లైన్, ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై వైసీపీ నేత పోసాని కృష్ణమూరళి (Posani Krishna Murali) హాట్ కామెంట్ చేశారు. సినిమా ఆర్టిస్టు కాబట్టే పవన్ కల్యాణ్ ను చూసేందుకు జనం వస్తున్నారన్నారు. వచ్చే జనం అంతా ఓట్లు వేస్తారనుకుంటే పొరపాటే అన్నారు. పవన్‌ కల్యాణ్‌ గురించి చాలా ఊహించుకున్నానని, కానీ పవన్ రాజకీయాలు చూశాక ఆయనపై ఉన్న గౌరవం పోయిందన్నారు. పవన్‌ ఒకప్పుడు చాలా మంచివాడని ఇప్పుడు మాత్రం పిచ్చివాడిలా ఎందుకయ్యాడో తెలియదని విమర్శించారు పోసాని కృష్ణమురళి.

ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వైఎస్సార్‌ను ఓడించడానికి కాదు, నేను గెలవడానికి పార్టీ పెట్టానని ఆనాడు చిరంజీవి చెప్పారన్నారు. ఇప్పుడు నేను సీఎంను అవుతాను, నాకు ఓటేయండి అని అడిగే ధైర్యం పవన్ కు లేదన్నారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు సీఎం చేస్తారా అంటూ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ఆరోపించారు. బాబు వేసిన స్కెచ్ ప్రకారమే పవన్ కల్యాణ్ నడుచుకుంటున్నాడని, ఆయన ఇచ్చిన స్రిప్ట్ ను బట్టి పట్టి మాట్లాడుతున్నాడరని విమర్శించారు. ముద్రగడ్డ గొప్పవారా..? పవన్ ను ప్రేమించే చంద్రబాబు గొప్పా..? అంటూ సెటైర్లు వేశారు పోసాని. మీ కులాన్ని మీరే తిట్టుకొని, మీ కాపు నేతల్ని మీరే తిడితే రిజర్వేషన్లు ఎప్పుడు రావాలన్నారు పోసాని కృష్ణమురళి.

Tags:
Next Story
Share it