Prudhvi Raj : నేను చంద్రబాబు, పవన్ వదిలిన బాణం !

నేను చంద్రబాబు, పవన్ వదిలిన బాణం అంటూ సినీ నటుడు, జనసేన నేత పృథ్వీ రాజు (Prudhvi Raj ) సంచలన కామెంట్స్ చేశారు. షర్మిల ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ

Prudhvi Raj : నేను చంద్రబాబు, పవన్ వదిలిన బాణం !
X

Prudhvi Raj : నేను చంద్రబాబు, పవన్ వదిలిన బాణం అంటూ సినీ నటుడు, జనసేన నేత పృథ్వీ రాజు (Prudhvi Raj ) సంచలన కామెంట్స్ చేశారు. షర్మిల ఇప్పుడు జగనన్న వదిలిన బాణం కాదు.. అవన్నీ పాత రోజులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ బాణమే..షర్మిల అన్నారు. ఆ బాణం వల్ల వైసీపీకి ఏం జరుగుతుందో చూడాలి..టీడీపీ, జనసేనల రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికమని ధీమా వ్యక్తం చేశారు.

175కు 175 సీట్లు గెలుస్తామన్నప్పుడు మీకు భయం ఎందుకు.. ఈ మార్పులు ఎందుకు అని ప్రశ్నించారు. నేను సినిమాలో వేసిన అంబటి డ్యాన్సు గురించి ముందు తెలియదు.. డైరెక్టర్ చెప్పినట్లు చేశానని క్లారిటీ ఇచ్చారు పృథ్వీ. రోడ్ల మీద డ్యాన్సులు వేసే వాళ్లు మంత్రులు ఏంటి..అంటూ అంబటికి కౌంటర్‌ ఇచ్చారు. 130 స్థానాలతో టీడీపీ, జనసేనల మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వల్ల ఏపీలో ఏ ప్రాజెక్టు ఆగిపోయాయో చెప్పాలని ఆగ్రహించారు. ఏపీలో ఒక్క రాజధాని లేదు.. ఇంకా మూడు ఎక్కడి నుంచి వస్తాయని మండిపడ్డారు పృథ్వీ (Prudhvi Raj ).

Tags:
Next Story
Share it