ISRO : PSLV C-56 రాకెట్ ప్రయోగం విజయవంతం..

PSLV C 56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది రాకెట్.

ISRO :  PSLV C-56 రాకెట్ ప్రయోగం విజయవంతం..
X

ISRO : PSLV C 56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది రాకెట్. దీంతో శ్రీ హరి కోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రయోగంలో పాలుపంచుకున్న సిబ్బందిని అభినందించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్. ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతం చేసింది ఇస్రో.

ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక సూర్యుడు పై పరిశోధనలకు ఆదిత్య L1.. ఉపగ్రహాన్ని త్వరలోనే ప్రయోగించనుంది ఇస్రో. ఈ తరుణంలోనే గగన్ యాన్ ప్రయోగానికి సిద్ధమవుతున్నారు శాస్త్ర వేత్తలు.

Tags:
Next Story
Share it