AP : జగన్‌ సర్కార్‌ పై పురంధేశ్వరి వివాదస్పద వ్యాఖ్యలు

జగన్‌ సర్కార్‌ పై బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇంధన పన్నులు

AP : జగన్‌ సర్కార్‌ పై పురంధేశ్వరి వివాదస్పద వ్యాఖ్యలు
X

AP : జగన్‌ సర్కార్‌ పై బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఇంధన పన్నులు అత్యధికంగా ఉన్నాయని.. ఆగ్రహించారు. ఏపీలో ఇంధన పన్నులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో..? ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. పెట్రోలియంపై కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్ను తగ్గించిందని మండిపడ్డారు.

ఏపీ ప్రజలకు ఊరట నిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పన్నులను తగ్గించడం లేదు..? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీపై రూ.200, ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్లపై రూ.400 తగ్గించిందని పేర్కొన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేస్తున్నా.. ఏపీలో అభివృద్ధి కన్పించడం లేదన్నారు. ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.

Tags:
Next Story
Share it