Roja:నా భార్య వీడియోలు బయట పెట్టండి..రోజా భర్త కామెంట్స్ వైరల్..!

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.  నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తాజాగా  మినిస్టర్ రోజాపై టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Roja:నా భార్య వీడియోలు బయట పెట్టండి..రోజా భర్త కామెంట్స్ వైరల్..!
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. తాజాగా మినిస్టర్ రోజాపై టిడిపి సీనియర్ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో సీరియస్ అయినా ఏపీ మహిళా కమిషన్ బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిజిపికి లేఖ రాసింది. ఇదే క్రమంలో రోజాపై చేసిన వ్యాఖ్యలకు రోజా భర్త సెల్వమని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ ఇలా అనుచితంగా మాట్లాడడం ఫస్ట్ టైం కాదని, గతంలో కూడా మాట్లాడారని సెల్వమని అన్నారు. నా భార్య బలంగా, ప్రజల ప్రజల కోసం పోరాటం చేస్తుంది, కాబట్టి ఆమెను మానసికంగా దెబ్బతీసే ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో టిడిపి నాయకులంతా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నరని, వీళ్ళు ఎన్ని రోజులు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారని ప్రశ్నించారు.

నేను బండారు సత్యనారాయణకు సవాల్ విసురుతున్న, మీ వద్ద ఎలాంటి వీడియోలు, ఫోటోలు ఉన్నా బయట పెట్టండి. మాకోసం ఆగాల్సిన పనేలేదు. నిచమైన పనులు మేము చేయం, టిడిపి పార్టీకి ఇలాంటి జబ్బు ఉన్నదేమో అని అన్నారు. రోజా ప్రజల మన్ననలు పొందుతుంది కాబట్టే ఆమెను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని, సత్యనారాయణ దగ్గర ఎలాంటి వీడియోలు, ఫోటోలు ఉన్న బయటపెట్టాలని భయపడేది లేదని, మేము ఎలాంటి పరిస్థితులనైనా, ఫేస్ చేస్తామని, మగాడు అంటే చెప్పిన మాట మీద నిలబడాలని సవాలు విసిరారు.

Tags:
Next Story
Share it