VISHAKAPATNAM : ఆంద్రలో పట్టాలు తప్పిన రైలు..

మొన్న జరిగిన ఒడిశా రైలు ప్రమాదం మరువకముందే. ఆంద్రప్రదేష్ రాష్ట్రంలో మరో రైలు కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పిందని

VISHAKAPATNAM : ఆంద్రలో పట్టాలు తప్పిన రైలు..
X

న్యూస్ లైన్, విశాకపట్నం : మొన్న జరిగిన ఒడిశా రైలు ప్రమాదం మరువకముందే. ఆంద్రప్రదేష్ రాష్ట్రంలో మరో రైలు కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తాడి-అనకాపల్లి మధ్య బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు తెల్లవారుజామున 3.35 గంటలకు పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు.

దీంతో విశాఖపట్నం-విజయవాడ ప్రధాన మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిసింది. కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశామని దక్షీణ మద్య రైల్వే అధికారులు తెలిపారు. మరికొన్ని రైళ్లు ఆలస్యమవుతాయని తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య నడుస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నది. ఉదయం 5.45 గంటలకు బయల్దేరాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. 8.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరుతుందని అధికారులు చెప్పారు. త్వరగా రైలును పట్టాలేక్కిస్తామని, నిర్ణయిత సమయంలో రైల్లను నడుపుతామని అధికారులు అన్నారు

Tags:
Next Story
Share it