Rains : ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Rains : ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు
X

Rains : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈనెల 4వ తేదీన కోస్తాంధ్ర తీరానికి చేరుకొని 5వ తేదీన నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

దీంతో ఆది ,సోమ, మంగళవారాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలలో అతి భారీ వర్షాలు పడతాయని... 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దీంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రేపు తుఫానుగా బలపడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.టోల్ ఫ్రీ నెంబర్లు రిలీజ్ చేయడమే కాకుండా చేపల వేటకు వెళ్లకూడదని మత్స్యకారులకు సూచనలు చేసింది ఏపీ సర్కార్. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అధికారులు మరియు ఉద్యోగులకు సెలవులు కూడా రద్దు చేసింది

Tags:
Next Story
Share it