Rajesh Mahasena : ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకున్న రాజేష్ మహాసేన!

ఒక యూట్యూబర్ గా తన అభిప్రాయాలను పంచుకుంటూ మొదట్లో వైసీపీ పార్టీ కి సపోర్టుగా ఎన్నో వీడియోలు చేసి, టీడీపీ జనసేన నాయకులపై మాటల దాడి చేసిన రాజేష్ మహాసేన, ఆ తర్వాత కొన్ని రోజులకు వైసీపీ పార్టీ కి దూరంగా జరిగి, జనసేన టీడీపీ కూటమి లో చేరారు.

Rajesh Mahasena : ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకున్న రాజేష్ మహాసేన!
X

న్యూస్ లైన్, గన్నవరం: ఒక యూట్యూబర్ గా తన అభిప్రాయాలను పంచుకుంటూ మొదట్లో వైసీపీ పార్టీ కి సపోర్టుగా ఎన్నో వీడియోలు చేసి, టీడీపీ జనసేన నాయకులపై మాటల దాడి చేసిన రాజేష్ మహాసేన, ఆ తర్వాత కొన్ని రోజులకు వైసీపీ పార్టీ కి దూరంగా జరిగి, జనసేన టీడీపీ కూటమి లో చేరారు. ఎస్సీ సామజిక వర్గానికి చెందిన రాజేష్ మహాసేన కి తెలుగు దేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే సీటుని కేటాయించింది. రాజేష్ మహాసేన లాంటి సామాన్యుడికి ఎమ్మెల్యే స్థానం దక్కడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. టీడీపీ, జనసేన రెండు పార్టీల క్యాడర్లకు కూడా రాజేష్ మహాసేన ముమిడివరం నుండి పోటీ చెయ్యడం ఇష్టం లేదు.

దీంతో రాజేష్ మహాసేన కి సొంత నియోజకవర్గం లో అడుగడుగునా జనసేన , టీడీపీ కార్యకర్తల నుండి అసమ్మతి సెగ తగిలింది. దీంతో వాళ్ళ టార్చర్ ని తట్టుకోలేక ఆయన ఈ స్థానం నుండి పోటీ చెయ్యడం లేదని, కుల పిచ్చి తో కొంతమంది అహంకారం వల్లనే నేను ఈ పోటీ నుండి తప్పుకుంటున్నానని, నా వల్ల చంద్రబాబు నాయుడుకి , పవన్ కళ్యాణ్ కి ఎలాంటి నష్టం కలగకూడదని ఈ సందర్భంగా రాజేష్ మహాసేన తెలిపారు.

Tags:
Next Story
Share it