Razole : రాజోలు వైసీపీ లో అసమ్మతికి శుభం కార్డు!

2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు. ఈ స్థానం నుండి రాపాక వరప్రసాద్ పోటీ చేసారు. అయితే ఎన్నికలలో ఆయన గెలిచిన తర్వాత జగన్ కి అనుకూలంగా మాట్లాడుతూ, ఆ తర్వాత నేరుగా వైసీపీ పార్టీ లో చేరిపోయారు.

Razole : రాజోలు వైసీపీ లో అసమ్మతికి శుభం కార్డు!
X

న్యూస్ లైన్, రాజోలు : 2019 సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు. ఈ స్థానం నుండి రాపాక వరప్రసాద్ పోటీ చేసారు. అయితే ఎన్నికలలో ఆయన గెలిచిన తర్వాత జగన్ కి అనుకూలంగా మాట్లాడుతూ, ఆ తర్వాత నేరుగా వైసీపీ పార్టీ లో చేరిపోయారు. రాజోలు లో ఎమ్మెల్యే సీట్ ఇస్తారని ఆశించిన రాపాక వరప్రసాద్ కి రాజోలు ఎంపీ స్థానం ని కేటాయించి, గొల్లపల్లి సూర్యారావు ని రాజోలు ఇంఛార్జిగా నియమించారు సీఎం జగన్. దీనికి రాపాక వరప్రసాద్ నిరసన వ్యక్తం చేసారు. ఇంఛార్జిని మార్చాలి అంటూ పెద్ద మీడియా ముఖంగా తెలిపారు. ఇక ఆయన అనుచరులు అయితే రాపాకకే ఈ సీటు ఇవ్వాలి అంటూ పట్టుబట్టారు. అయితే ఈ విషయం తెలుసుకున్న సీఎం జగన్, రాపాక వరప్రసాద్ తో మాట్లాడి సమస్య సర్దుమణిగేలా చేసారు. దీంతో రాపాక వరప్రసాద్ నేడు గొల్లపల్లి ని ఆయన నివాసం లో కలిసి, అనంతరం మీడియా తో మాట్లాడారు. రాజోలు లో వైసీపీ గెలుపునకు అన్నీ విధాలుగా ప్రయత్నం చేస్తాను అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it