Ap Elections : రాయలసీమలో ఏ పార్టీది పై చేయి...!

మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి..ఈ ఎన్నికలలో రాయలసీమ లో ప్రస్తుతం వచ్చిన సర్వేల ప్రకారం ఏ పార్టీ కి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి ఒకసారి చూద్దాం.

Ap Elections : రాయలసీమలో ఏ పార్టీది పై చేయి...!
X

Newsline, Rayalaseema : గత ఎన్నికలలో వైసీపీ పార్టీ రాయలసీమ లో క్లీన్ స్వీప్ చేసి ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం లో మొదటి నుండి పట్టు ఉన్న తెలుగు దేశం పార్టీ కి 2019 ఎన్నికలు ఘోరమైన పరాభవం ని మిగిల్చాయనే చెప్పాలి. మళ్ళీ ఒంటరిగా పోతే ఎక్కడ ఇలాంటి ఫలితాలు వస్తాయో అని భయపడి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో కలిసినప్పటికీ కూడా వైసీపీ పార్టీ నే రాబొయ్యే ఎన్నికలలో కూడా రాయలసీమ లో సత్తా చాటనుంది అని రీసెంట్ సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా కడప, కర్నూల్ మరియు అనంతపురం జిల్లాలలో టీడీపీ - జనసేన కి 2 నుండి 3 సీట్లు మాత్రమే వస్తాయని. మిగిలినవన్నీ వైసీపీ కి వస్తాయని ఈ సర్వేల ద్వారా తెలిసింది అట. అంతే కాదు చంద్రబాబు నాయుడు పోటీ చేసే కుప్పం లో కూడా ఈసారి టీడీపీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలలో కుప్పం మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది అనే విషయం మన అందరికీ తెలిసిందే. చంద్రబాబు ని ఈ ప్రాంతం లో ఓడించేందుకు జగన్ ఎప్పుడో మాస్టర్ స్కెచ్ వేసాడని, కుప్పం ప్రాంతం లో ఈసారి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు కి కూడా తన అంతర్గత సర్వేల ద్వారా తెలిసింది కాబట్టే ఆయన ఇప్పుడు కుప్పం లో పర్యటిస్తున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. కేవలం కుప్పం మాత్రమే కాదు, ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు, ప్రస్తుత హిందూపురం ఎమ్యెల్యే బాలయ్య బాబు కూడా ఈసారి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రీసెంట్ సర్వే రిపోర్టులు తెలుపుతున్నాయి. ఈ భయం తోనే చంద్రబాబు నాయుడు ఈసారి కుప్పం తో పాటుగా, ఉత్తరాంధ్ర ప్రాంతం లోని భీమిలి లో కూడా పోటీ చేయబోతున్నాడని, అలాగే బాలకృష్ణ కూడా హిందూపురం తో పాటుగా గుడివాడ నుండి పోటీ చేస్తాడని అంటున్నారు. మొత్తం మీద రాయలసీమ ప్రాంతం లో వైసీపీ కి ఈసారి 38 కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని అంటున్నారు,చూడాలి మరి.

Tags:
Next Story
Share it