Cm Jagan : ఎల్లుండి నుండి ఏపీ లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్స్!

'పేదలందరికీ ఇల్లు' అనే పథకం క్రింద జగన్ సర్కార్ రాష్ట్రం లో ఉన్న 31.19 లక్షల మంది నిరుపేదలకు ఇప్పటి వరకు ఇళ్లను మంజూరు చేసారు. ఈ ఇళ్లకు పట్టాలను వారి పేరు మీద రిజిస్టర్ చేసే కార్యక్రమం ఎల్లుండి నుండి ప్రారంభించబోతున్నట్టు అధికారులు తెలిపారు.

Cm Jagan : ఎల్లుండి నుండి ఏపీ లో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్స్!
X

న్యూస్ లైన్, అమరావతి : 'పేదలందరికీ ఇల్లు' అనే పథకం క్రింద జగన్ సర్కార్ రాష్ట్రం లో ఉన్న 31.19 లక్షల మంది నిరుపేదలకు ఇప్పటి వరకు ఇళ్లను మంజూరు చేసారు. ఈ ఇళ్లకు పట్టాలను వారి పేరు మీద రిజిస్టర్ చేసే కార్యక్రమం ఎల్లుండి నుండి ప్రారంభించబోతున్నట్టు అధికారులు తెలిపారు. 12 రోజుల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేసారు. ఈ పట్టాలను పొందిన లబ్ధిదారులు పదేళ్ల తర్వాత పట్టాలపై సర్వ హక్కులు పొందనున్నారు. అప్పుడు వారు ఈ ఇంటి పట్టాలపై బ్యాంక్ లో లోన్లు తీసుకోవడం, లేదా ఎవరికైనా అమ్మేయడం వంటివి చేసుకోవచ్చు. అప్పటి వరకు ఇంట్లో నివసించేందుకు హక్కు ఉంది కానీ, సర్వహక్కులు మాత్రం పదేళ్ల తర్వాతనే అని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. ఇవాళ, రేపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన ట్రయిల్ రన్ జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియచేయనున్నారు అధికారులు.

Tags:
Next Story
Share it