Ayodhya : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం!

కాసేపటి క్రితమే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో పవన్ కళ్యాణ్ కి ఆర్.ఎస్.ఎస్. ప్రాంత సంపర్క ప్రముఖ్ శ్రీ ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రికని అందచేసాడు. ఆయనతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ శ్రీ పూర్ణ ప్రజ్ఞ కూడా ఈ భేటీ లో పాల్గొన్నారు. అయోధ్య రామాలయం కి సంబంధించిన విశేషాలను పవన్ కళ్యాణ్ తో పంచుకొని కాసేపు ముచ్చటించారు.

Ayodhya : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం!
X

Newsline, Mangalagiri : ఈ నెల 22 వ తారీఖున అయోధ్య లో అట్టహాసం గా రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హిందువుల కలని నెరవేర్చింది. ఈ ప్రారంభోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వేల సంఖ్యలో హాజరు కాబోతున్నారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సీఎం యోగి చూసుకున్నారు. అంతే కాకుండా ఈ ప్రారంభోత్సవ వేడుకలకు సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం లో పవన్ కళ్యాణ్ కి ఆర్.ఎస్.ఎస్. ప్రాంత సంపర్క ప్రముఖ్ శ్రీ ముళ్లపూడి జగన్ ఆహ్వాన పత్రికని అందచేసాడు. ఆయనతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శ్రీనివాస రెడ్డి, ఆర్.ఎస్.ఎస్. కార్యాలయ ప్రముఖ్ శ్రీ పూర్ణ ప్రజ్ఞ కూడా ఈ భేటీ లో పాల్గొన్నారు. అయోధ్య రామాలయం కి సంబంధించిన విశేషాలను పవన్ కళ్యాణ్ తో పంచుకొని కాసేపు ముచ్చటించారు.

పవన్ కళ్యాణ్ తో పాటుగా చిరంజీవి మరియు ప్రభాస్ కి కూడా ఆహ్వానం అందించారు. అయితే చిరంజీవి కొన్ని కారణాల చేత రాలేకపోతుండగా, ప్రభాస్ వస్తాడో లేదో తెలియాల్సి ఉంది. అంతటి ప్రతిష్టాత్మక ఆలయ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆహ్వానం పవన్ కళ్యాణ్ కి దక్కినందుకు ఆయన అభిమానులు ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కాబోతున్నాడా లేదా అనేది చూడాలి.

Tags:
Next Story
Share it