Gudiwada : ఆర్టీసీ బస్సు క్రింద పడి ముగ్గురు మృతి

కృష్ణ జిల్లా గుడివాడలో ఘోర ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్ లో ఆర్టీసీ బస్సు ఒక స్కూటీ వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. దీంతో స్కూటీ లో ప్రయాణిస్తున్న ముగ్గురు బస్సు క్రింద పడి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు.

Gudiwada : ఆర్టీసీ బస్సు క్రింద పడి ముగ్గురు మృతి
X

న్యూస్ లైన్, గుడివాడ : కృష్ణ జిల్లా గుడివాడలో ఘోర ప్రమాదం జరిగింది. బస్టాండ్ సెంటర్ లో ఆర్టీసీ బస్సు ఒక స్కూటీ వెనుక నుండి వచ్చి ఢీ కొట్టింది. దీంతో స్కూటీ లో ప్రయాణిస్తున్న ముగ్గురు బస్సు క్రింద పడి అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. చనిపోయిన వారి పేర్లు సోహైల్, సాయి, హర్షగా పోలీసులు గుర్తించారు. వెనుక నుండి వచ్చి ఢీ కొట్టాడు కాబట్టి ఇది కచ్చితంగా బస్సు డ్రైవర్ తప్పే. అంత పెద్ద సెంటర్ లో వేగంగా బస్సులు వెళ్ళడానికి కూడా లేదు. అలాంటి సెంటర్ లో ప్రమాదం జరిగింది అంటే సాధారణమైన సంఘటన కాదు. ఇలాంటి ప్రమాదాలను మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. చనిపోయిన వారి కుటుంబాలు తమ బిడ్డలా మృతదేహాలను చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. వీళ్ళ బాధని చూసి సమీపం లో ఉన్న ప్రజలు కూడా కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:
Next Story
Share it