Sajjala: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్!

ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి (sajjala ramakrishna reddy) కౌంటర్ ఇచ్చారు.

Sajjala: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్!
X

న్యూస్‌లైన్, డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) వ్యాఖ్యలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి (sajjala ramakrishna reddy) కౌంటర్ ఇచ్చారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్లే ఆంధ్రప్రదేశ్‌లో అంటూ సత్తుపల్లిలో కేసీఆర్ కామెంట్లు చేశారు. సరిహద్దులోని ఏపీ ప్రజలు తెలంగాణకు (Telangana) వచ్చి వరి ధాన్యం అమ్ముకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. ఏపీ వాళ్లే చీకట్లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. దీనిపై తాజాగా సజ్జల రామకృష్ణ స్పందించారు. ఎన్నికల కోసమే కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారంటూ కౌంటర్ ఇచ్చారు. ఏడు విలీన మండలాల ప్రజలు మళ్ళీ తెలంగాణకు వెళతారా? అని ఎవరో అడిగితే మేం వెళ్ళమని స్పష్టం చేశారని తెలిపారు.

అక్కడ ఏం లేవో కూడా చెప్పుకుంటే బాగుంటుందన్నారు. సరిహద్దు గ్రామాల ప్రజలు తమకు జగన్ ముఖ్యమంత్రిగా కావాలి అంటున్నారని చెప్పారు. ఏపీలో పెన్షన్ అద్భుతంగా అమలు అవుతుందని కేసీఆర్ స్వయంగా చెప్పారని, అలాగే తాము కూడా పెన్షన్ అమలు చేస్తామని కూడా కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. తమ ప్రైవేటు వ్యాపారాలను రక్షించుకునే వాళ్ళు హైదరాబాద్ (hyderabad) ర్యాలీలో పాల్గొన్నారన్నారు. వంద వాహనాలు పెడితే రోడ్డు జామ్ కాకుండా ఎలా ఉంటుందని సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రశ్నించారు.

Tags:
Next Story
Share it