Pensions: సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ ఉంటుంది - సజ్జల రామకృష్ణ

ఎన్నికల నేపథ్యం లో ఎలక్షన్ కమీషన్ వాలంటీర్లను పెన్షన్స్ అందించడానికి వీలు లేదని కఠినంగా నిబంధన విధించడం పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ లబ్దిదారులకు కీలక ప్రకటన చేసారు.

Pensions: సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీ ఉంటుంది - సజ్జల రామకృష్ణ
X

న్యూస్ లైన్, అమరావతి: ఎన్నికల నేపథ్యం లో ఎలక్షన్ కమీషన్ వాలంటీర్లను పెన్షన్స్ అందించడానికి వీలు లేదని కఠినంగా నిబంధన విధించడం పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ లబ్దిదారులకు కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల వల్ల వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్స్ అందించే పరిస్థితి లేదని, కావున సమీపం లో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏప్రిల్ 3 వ తారీఖు నుండి లబ్ధిదారులు పెన్షన్స్ తీసుకోవచ్చని, రెండు నెలలు పెన్షన్స్ రావేమో అని లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదని సజ్జల రామకృష్ణ ఈ సందర్భంగా ప్రకటించారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్ల సేవలను ఈసీ ద్వారా నిలుపుదల చేసారని, ప్రజలు ఆయనకీ తగిన బుద్ధి త్వరలోనే చెప్తారని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. గడిచిన 5 ఏళ్ళల్లో వాలంటీర్లు వృద్దులకు ఇంటి వద్దకి వచ్చి పెన్షన్స్ అందించేవారు. కానీ ఇప్పుడు ఎండల్లో క్యూ లైన్స్ లో నిలబడి పెన్షన్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:
Next Story
Share it