SANKRANTHI: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఇంకా అవ్వలే..

ఇప్పటి వరకు పూర్వికులకు బట్టలు పెట్టడం , పేదవారికి సాయం చేసి దుప్పట్లు ..తోచిన సాయం చేయడం తో పాటు కుటుంబం అంతా కలిసి పండుగ జరుపుకుంటారు.

SANKRANTHI:  తెలుగు రాష్ట్రాల్లో  సంక్రాంతి ఇంకా అవ్వలే..
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సంక్రాంతి..సంక్రాంతి అయిపోయింది సంక్రాంతి. ఉత్తరాంధ్ర జనాలు నెలలు వెయిట్ చేస్తారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోతది సంక్రాంతి. కాని చాలా వరకు విశాఖ , విజయనగరం , తుని , పశ్చిమ గోదావరి వైపు మాత్రం సంక్రాంతి సంబరాలు మరో నాలుగు ఐదు రోజులుంటాయి.

ఇప్పటి వరకు పూర్వికులకు బట్టలు పెట్టడం , పేదవారికి సాయం చేసి దుప్పట్లు ..తోచిన సాయం చేయడం తో పాటు కుటుంబం అంతా కలిసి పండుగ జరుపుకుంటారు. కాని ఈ రోజు నుంచి పేరంటాళ్లు ..అంటే ఇంట్లో చిన్న వయసులో చనిపోయిన ఆడపిల్లలకు బట్టలు పెడతారు. కాస్త పెద్ద ఫ్యామిలీలు..డబ్బున్న కుటుంబాలయితే ..ఆ ఇంటి పేరు మీద ..జాతర జరిపిస్తారు. అంటే రామాలయం కాని దగ్గర్లో ఉన్న దేవాలయంలో ప్రత్యేకపూజలు జరిపించి...రంగు రంగుల రాట్నాలు వేయిస్తారు.

రేపు , ఆ తరువాతి రోజు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చిన్న చిన్న ఊర్ల నుంచి పెద్ద ఊర్లలో కూడా పండుగ చేసుకొని చిన్న చిన్న పండుగలు చేస్తూనే ఉంటారు. కొన్ని కుటుంబాలు అక్కడే వంట వార్పు చేసుకొని కుటుంబమంతా ..మొక్కులు చెల్లించుకొని ఆఖరికి ఈ నెల వచ్చే ఆఖరి శనివారం శివ పార్వతుల పండుగలు చేస్తారు. ఈ పండుగ చాలా వరకు విశాఖ , అనకాపల్లి, విజయనగరం లాంటి ప్రాంతాల్లో ఉంటుంది. ఈ పండుగ చాలా పెద్ద పండుగ దాదాపు అల్లుళ్లు..చుట్టాలు మరోసారి కుటుంబం అంతా సంక్రాంతి అంత గొప్పగా చేసుకునే పండుగ . అప్పుడు అంటే జనవరి చివరి వారంతో సంక్రాంతి సందడి తగ్గి ..అల్లుళ్లు, కూతుర్లు ఎవ్వరి ఇంటికి వాళ్లు వెళ్లిపోతారు.

Tags:
Next Story
Share it