AP : ఇవాళ స్కూళ్లు, కాలేజీలు బంద్

విశాఖ ఉక్కు పరిశ్రమను (vizag steel plant) ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమానికి ఇవాల్టితో వెయ్యి రోజులు పూర్తికానున్నాయి. వేల మంది త్యాగాలతో ఏర్పడిన ఈ పరిశ్రమను కాపాడుకునేందుకు

AP : ఇవాళ స్కూళ్లు, కాలేజీలు బంద్
X

AP : విశాఖ ఉక్కు పరిశ్రమను (vizag steel plant) ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమానికి ఇవాల్టితో వెయ్యి రోజులు పూర్తికానున్నాయి. వేల మంది త్యాగాలతో ఏర్పడిన ఈ పరిశ్రమను కాపాడుకునేందుకు భూ నిర్వాసితులు, కార్మిక, ఉద్యోగ సంఘాలు 2021 ఫిబ్రవరి 3 నుంచి ఆందోళనలు తీవ్రతరం చేస్తూనే ఉన్నారు. 2021-22లో 1000 కోట్ల లాభాలను అర్జించిన విశాఖ ఉక్కు (vizag steel plant)ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

అయితే, విశాఖ ఉక్కు (vizag steel plant) పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధనకు మద్దతుగా ఇవాళ విద్యాసంస్థల బంద్ (schools) చేపట్టనున్నట్లు PDSU, AISF, SFI, AIYF ప్రకటించాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి ఇవాల్టితో వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ బంద్ చేపట్టనున్నారు. అన్ని యువజన, విద్యార్థి సంఘాలు ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి.

Tags:
Next Story
Share it