Tdpjanasena: టీడీపీ - జనసేన సీట్లలో కీలక మార్పులు..నాగబాబు కి సీట్ లేనట్టేనా?

గత నెల 24 వ తేదీన టీడీపీ - జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి మీడియా ముందు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు దేశం పార్టీ శ్రేణులు సీట్ల పట్ల సంతోషంగానే ఉన్నప్పటికి , జనసేన పార్టీ శ్రేణులు మాత్రం తీవ్రమైన నిరాశలో ఉన్నారు.

Tdpjanasena: టీడీపీ - జనసేన సీట్లలో కీలక మార్పులు..నాగబాబు కి సీట్ లేనట్టేనా?
X

న్యూస్ లైన్,అమరావతి : గత నెల 24 వ తేదీన టీడీపీ - జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి మీడియా ముందు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు దేశం పార్టీ శ్రేణులు సీట్ల పట్ల సంతోషంగానే ఉన్నప్పటికి , జనసేన పార్టీ శ్రేణులు మాత్రం తీవ్రమైన నిరాశలో ఉన్నారు. 40 కి పైగా సీట్లు వస్తాయని భావిస్తే, 24 సీట్లకే పరిమితం కావడం అనేది జనసేన పార్టీ శ్రేణులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇచ్చిన ఈ సీట్లలో కూడా కొన్ని మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ప్రకటించిన 5 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో అనకాపల్లి స్థానంకి గానూ కొణతాల రామకృష్ణ పేరు ఉంది.

అయితే ఇప్పుడు ఆ స్థానం టీడీపీ అభ్యర్థి పీలా గోవింద్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొణతాల రామకృష్ణ ని అనకాపల్లి ఎంపీ గా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. ఇంతకుముందు అనకాపల్లి ఎంపీ గా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం లో ఉండేది, ఇప్పుడు అసలు నాగబాబు కి టికెట్ దొరకడం కూడా కష్టమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అలాగే కందుల దుర్గేష్ ని రాజమండ్రి రూరల్ స్థానం నుండి నిడదవోలు కి మార్చగా, అమలాపురం సీట్ బదులుగా పీ. గన్నవరం సీట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వీటిపై పూర్తి స్థాయి క్లారిటీ నేడు, రేపటి లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:
Next Story
Share it