Ys Sharmila : షర్మిల వల్ల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమి లేదా..!

షర్మిల కాంగ్రెస్ పార్టీ లో చేరడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదా..?

Ys Sharmila : షర్మిల వల్ల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమి లేదా..!
X

Newsline, Newdelhi: ఒకప్పుడు షర్మిల అంటే జనాల్లో చాలా గౌరవం ఉండేది. ఎందుకంటే వైసీపీ పార్టీ స్థాపించిన తర్వాత జగన్ పై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసి 16 నెలలు జైలులో ఉంచినప్పుడు, షర్మిల మరియు విజయమ్మ రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ తరుపున కార్యకర్తలకు అండగా నిలుస్తూ, పాదయాత్ర చేపట్టి,పార్టీని బలోపేతం చేసారు. ఆ 2019 ఎన్నికల సమయం లో కూడా ఎలాంటి పదవి ఆశించకుండా ఎన్నికల వైసీపీ పార్టీ తరుపున ఎన్నికల ప్రచారం చేపట్టింది. కానీ ఇప్పుడు మాత్రం వైఎస్ అభిమానులు రాజన్న బిడ్డ షర్మిల అని చెప్పుకోడానికి సిగ్గు పడుతున్నారు. అకస్మాత్తుగా జగన్ కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ బయటకి రావడం, తెలంగాణ లో పార్టీ ని పెట్టి హడావడి చేసి , చివరికి ఎన్నికల్లో కూడా పోటీ చెయ్యకుండా నేడు కాంగ్రెస్ పార్టీ లో కలిపేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని అంటున్నారు నెటిజెన్స్. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడి నుండి పార్టీ కి ప్రాతినిధ్యం వహించమంటే , అక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తాను అంటూ చెప్పుకొస్తున్న షర్మిల ని చూసి ఏపీ జనాలు నవ్వుకుంటున్నారు.

ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తాను అని చెప్పి, ఇప్పుడు కాంగ్రెస్ ఏది చెప్తే అది చేస్తాను అంటోంది. తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టిన ఈమె, ఏనాడు కూడా ఆంధ్ర ప్రజల గురించి ఆలోచించలేదు. అలాంటి ఆమె ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం వహిస్తే జనాలు ఎలా ఆమెని అక్కున చేర్చుకుంటారు అనుకుందో ఆమెకే తెలియాలి. ఆమె అన్నయ్య జగన్ సొంతగా పార్టీ పెట్టి నేడు రాష్ట్రం లో ఎన్నో ప్రతిపక్షాలను ఎదురుకుంటూ రాబొయ్యే ఎన్నికలలో మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి సమయం లో ప్రభుత్వ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా వచ్చిన షర్మిల ఓటు వేస్తే కచ్చితంగా జనాలు మోసపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు..ఎందుకంటే యుద్ధం చెయ్యకుండానే పారిపోయిన ఈ మనిషిని నమ్మి, మన రాష్ట్ర ప్రజలు ఓటు వేసి ఎందుకు మోసపోతారు అని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

Tags:
Next Story
Share it