Ys Sharmila: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పడుకున్న షర్మిల..!

ఏపీలో వైయస్ షర్మిల దూకుడు కొనసాగిస్తోంది. ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ షర్మి

Ys Sharmila: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పడుకున్న షర్మిల..!
X

ఏపీలో వైయస్ షర్మిల దూకుడు కొనసాగిస్తోంది. ఇటీవల తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నియామకం అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వైసిపి పార్టీపై విమర్శలు చేస్తూ... జగన్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు షర్మిల. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీలోనే పడుకొని తన నిరసనలు తెలిపారు షర్మిల.

నిరుద్యోగుల సమస్యలపై పోరాడటానికి 'ఛలో సచివాలయం'కు కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వగా ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో షర్మిలను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆమె కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనే ఉండి రాత్రి అక్కడే బస చేశారు.

ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ...నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా ? అని నిలదీశారు. వేలాదిగా తరలి వస్తున్న పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారు ? ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా ? అని ఫైర్ అయ్యారు. నేను ఒక మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు,పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి గడప వలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా ? అంటూ మండిపడ్డారు.

Tags:
Next Story
Share it