Ys Sharmila : చంద్రబాబు ఇంటికి వైస్ షర్మిల

కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల (Ys Sharmila) వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల ఇంటికి వెళ్తున్నారు. ఇటీవలే వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఫిక్స్

Ys Sharmila : చంద్రబాబు ఇంటికి వైస్ షర్మిల
X

Ys Sharmila : కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల (Ys Sharmila) వరుసగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల ఇంటికి వెళ్తున్నారు. ఇటీవలే వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో సెటిల్ అయిన ఓ అమ్మాయిని రాజారెడ్డి (raja reddy)ప్రేమించాడు. ఇక వీరి ప్రేమకు షర్మిల కుటుంబం ఒప్పుకుంది. పెళ్లి కూడా ఫిక్స్ చేసింది. దీంతో తన కుమారుడి పెళ్లి కార్డు పట్టుకొని, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు వైఎస్ షర్మిల (Ys Sharmila).

ఈ తరుణంలోనే ఇప్పటికే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి (cm jagan) ఆహ్వాన పత్రిక అందించారు షర్మిల (Ys Sharmila). ఆ తర్వాత ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులను కలిశారు షర్మిల. ఇక ఇవాళ జగన్ శత్రువు అయిన చంద్రబాబు నాయుడును కలవబోతున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు చంద్రబాబు (chandrababu) నివాసంలో ఆయనను షర్మిల కలుస్తారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని షర్మిల కోరనున్నారు. దీంతో చంద్రబాబు మరియు షర్మిల సమావేశం ఆసక్తికరంగా మారింది. కాగా ఇటీవల తన పార్టీని కాంగ్రెస్ లో మెర్జి చేసింది షర్మిల (Ys Sharmila). అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది.

Tags:
Next Story
Share it