Guntur : ప్రేయసిని ముక్కలుగా నరికి KL యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య!

కేఎల్ యూనివర్సిటీ లో ఇటీవలే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన మన అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థి కాలేజీ డీన్ పేరు రాసి చనిపోయాడు. పోలీసులు ఆ డీన్ ని అరెస్ట్ చేసారు.

Guntur : ప్రేయసిని ముక్కలుగా నరికి KL యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య!
X

న్యూస్ లైన్, గుంటూరు : కేఎల్ యూనివర్సిటీ లో ఇటీవలే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన మన అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో విద్యార్థి కాలేజీ డీన్ పేరు రాసి చనిపోయాడు. పోలీసులు ఆ డీన్ ని అరెస్ట్ చేసారు. అనంతరం పోలీసులు అసలు ఈ ఆత్మహత్య ఎలా జరిగింది అనేది విచారిస్తుండగా సంచలన నిజాలు బయట పడ్డాయి. ఆ అబ్బాయి అలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ట్రైయాంగులర్ లవ్ స్టోరీ పరిణామం వల్లే అని తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇద్దరు అబ్బాయిలు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించారు. ఒకరోజు ముగ్గురు కలిసి బయటకి సరదాగా వెళ్లారు. తిరిగి వచ్చే క్రమం లో ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి, అలాగే బయట హాస్టల్ అబ్బాయి ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు. 'నువ్వంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం, నువ్వు మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని ప్రేమించు' అని అడుగుతారు.

అప్పుడు ఆ అమ్మాయి నాకు ఎవరూ వద్దు, నేను ఎవరినీ ప్రేమించను అని చెప్పడంతో ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని చంపేస్తారు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి, సూట్ కేసు లో పెట్టి, ఆ అమ్మాయి రూమ్ మేట్ కి ఫోన్ చేసి 'ఈ సూట్ కేసు మీ రూమ్ కి తీసుకెళ్ళు, మీ స్నేహితురాలు తర్వాత వస్తుంది' అని ఆ అమ్మాయికి సూట్ కేసు ని ఇచ్చి పంపేసారట. ఆ తర్వాత ఆ ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోగా, సూసైడ్ చేసుకున్న అబ్బాయి బయట హాస్టల్ అబ్బాయిని చంపేసి, ఆ తర్వాత కాలేజీ కి వచ్చి డీన్ పేరు రాసి ఆత్మహత్య చేసుకున్నాడట. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది.

Tags:
Next Story
Share it