Vishaka Jail : విశాఖ జైలులో కోడి కత్తి శ్రీను నిరాహార దీక్ష!

జగన్ పై కోడి కత్తి దాడిలో అరెస్ట్ కాబడిన దళిత యువకుడు జనుపల్లి శ్రీనివాసరావు తనని బైలు మీద విడిచిపెట్టాలని విశాఖ సెంట్రల్ జైలు లో నిరాహార దీక్ష చేపట్టాడు.

Vishaka Jail :  విశాఖ జైలులో కోడి కత్తి శ్రీను నిరాహార దీక్ష!
X

న్యూస్ లైన్, వైజాగ్ : జగన్ పై కోడి కత్తి దాడిలో అరెస్ట్ కాబడిన దళిత యువకుడు జనుపల్లి శ్రీనివాసరావు తనని బైలు మీద విడిచిపెట్టాలని విశాఖ సెంట్రల్ జైలు లో నిరాహార దీక్ష చేపట్టాడు. అదే సమయం లో అతని తల్లి సావిత్రమ్మా, సోదరుడు సుబ్బరాజు కూడా విజయవాడ లోని ఒక రహస్య ప్రదేశం లో నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీనివాస్ దీక్ష చేస్తున్నాడు అనే సమాచారం ని అందుకొని దళిత సంఘాల నాయకులు శ్రీనివాస్ ని ములాఖత్ ద్వారా గురువారం రోజు కలిశారు. దీక్షకు పోలీసులు ఏ విధంగా అయినా ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, వారిని అలా చేసేందుకు వీళ్ళు లేకుండా మీరే సహాయం చెయ్యాలంటూ శ్రీనివాస్ తనని కలవడానికి వచ్చిన దళిత సంఘాలను కోరాడట. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. తనకి బెయిల్ మంజూరు చేసే వరకు ఎవరెన్ని ప్రయత్నాలు చేసిన దీక్ష విరమించబోనని ఈ సందర్భంగా శ్రీనివాస్ డిమాండ్ చేసినట్టు సమాచారం.

Tags:
Next Story
Share it