Vande Bharath : ఆగిపోయిన వందే భారత్ రైలు

గురువారం విశాఖ నుంచి సికింద్రాబాద్ కు రావాల్సిన వందేభారత్ రైలును రైల్వే అధికారులు రద్దు చేశారు.

Vande Bharath : ఆగిపోయిన వందే భారత్ రైలు
X

హఠాత్తుగా ఆగిన విశాఖ-సికింద్రాబాద్ రైలు
టెక్నికల్ ఇష్యూ అంటూ చివరి నిమిషంలో ప్రయాణికులకు సమాచారం
ఒడిషాలో గాలి దుమారానికి ఎగిరిపోయిన ముందు భాగం
మొన్న ఆకతాయి సిగరెట్ అంటిస్తే కాలిపోయిన కోచ్
వందే భారత్ రైళ్ల నిర్వహణపై వెల్లువెత్తున్న విమర్శలు
వంద సార్లు జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

తెలంగాణం, బ్యూరో : వందేభారత్ ను వందసార్లు ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి. ఓ స్కీంకు, ఓ ప్రాజెక్టుకు ఇన్నిసార్లు పచ్చ జెండా ఊపిన మరో కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని సెటైర్లు పడ్డా కూడా ఆ పార్టీ నేతల డంభాచారం ఏ మాత్రం తగ్గలేదు. కాని ఏం ఉపయోగం. వందే భారత్ రైలు స్పీడ్ మాట దేవుడెరుగు. టైంకు పోతే చాలన్నట్లు తయారైంది ఆ రైలు సర్వీసు. భారత రైల్వే జీవిత కాలం లేటు అన్న నానుడిని నిజం చేస్తూ వందే భారత్ రైళ్లు కూడా నార్మల్ ట్రైన్స్ లాగా సడన్ జర్క్ లు ఇస్తున్నాయి.

ఆగిపోయిన విశాఖ-సికింద్రాబాద్ రైలు
గురువారం విశాఖ నుంచి సికింద్రాబాద్ కు రావాల్సిన వందేభారత్ రైలును రైల్వే అధికారులు రద్దు చేశారు. టెక్నికల్ ఇష్యూ పేరుతో మరో ట్రైన్ ను ప్రయాణికులకు ఏర్పాటు చేశారు. వారి ప్రయాణానికి ఇబ్బంది రాకుండా వేరే ట్రైన్ ను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఇక్కడ వరకు బాగున్నా వందేభారత్ ట్రైన్ ఎలా ఉంటుందో అని టికెట్లు తీసుకున్న వాళ్ల పరిస్థితి దారుణమనే చెప్పాలి. టికెట్ కు అన్ని డబ్బులు ఖర్చు చేశాక కూడా ఏదో సాదారణ ట్రైన్ కు రీజన్ చెప్పినట్లు సడన్ గా ట్రైన్ క్యాన్సిల్ అని చెప్పడం ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ రైలు కూడా వందేభారత్ ఆగే స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు. పూర్తి సమాచారం కోసం ఆయా స్టేషన్‌లలో విచారణ కేంద్రాలు, అధికారుల్ని సంప్రదించాలన్నారు.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాల్సిన వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌‌ హఠాత్తుగా రద్దైంది. గురువారం రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ నుంచి ఉదయం 5.45కి బయల్దేరాల్సిన రైలును సాంకేతిక కారణాలతో రద్దు చేసినట్లు ప్రకటించారు. వందేభారత్ కోచ్‌లలో ఒకదానికి సాంకేతిక సమస్య ఉన్నట్లు అధికారులు గుర్తించారట. వందేభారత్ రద్దు సమాచారాన్ని ఉదయం 5 గంటల నుంచి ప్రయాణికులకు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశారు.
అయితే టికెట్ రేట్ల పేరుతో వేలకు వేలు టికెట్లు వసూళ్లు చేసి వందేభారత్ ట్రైన్లను ఆపేయడమేంటని తెగ ఫైర్ అవుతున్నారు ప్రయాణికులు. పాత రైళ్లకు పెయింట్ మార్చి ఏసీ వేసి టికెట్లు వసూలు చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు. నెటింట్లో వందేభారత్ ఫైర్ ఇన్సిడెంట్ వీడియోలు, మొన్నటికి మొన్న ఓ బర్రెను గుద్దితే వందేభారత్ గంట లేటయ్యింది. ఇదే మన మామూలు ట్రైన్లు ఎన్నిసార్లు అనుకోని యాక్సిడెంట్లు కాలేదు. రాజాలాగా చెక్కు చెదరకుండా ఈలలేస్తూ గమ్యాన్ని చేరుకున్నాయి. మరి ఇవేం రైళ్లు ? రైల్వేకు కాసులు కురిపించే రైళ్లు అంటూ జనం చిరాకుపడుతున్నారు.
వందేభారత్ లో ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్న సమస్య టెక్నికల్ ఇష్యూస్. మంటలు అంటుకోవడం, ప్రతి చిన్న దానికి గంటలు గంటలు ఆగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఒరిస్సాలో అయితే గాలి దుమారానికి ముందు పార్ట్ మొత్తం ఎగిరిపోయింది. ఇది మోడి చెప్పిన మేక్ ఇన్ ఇండియా రైళ్ల పరిస్థితి. పాత రైళ్లకు పెయింట్ వేయించినా ఇంత కంటే బెటర్ ప్రయాణాలు చెయ్యొచ్చంటూ ఓ బెంగుళూరు వ్యక్తి ట్విట్ చేయడం వందే భారత్ రైళ్ల దుస్థితికి అద్దం పడుతోంది. ఇకనైనా ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టకుండా అనవసర ఆర్భాటాలకు పోకుండా ఉన్నవాటితో నడిపిస్తున్నారని ప్రయాణికులు ఆశిస్తున్నారు.

Tags:
Next Story
Share it