Help me:కంటే కూతురునే కనాలి రా..!!

కంటే కూతురినే కనాలి రా..మనసుంటే మగాడిలా పెంచాలి రా.. ఆ కవి ఊరికే రాయలేదు. సమాజంలో కూతురు వ్యాల్యూను  ఈ పాట ద్వారా చాలా గొప్పగా చూపించాడు.

Help me:కంటే కూతురునే కనాలి రా..!!
X

న్యూస్ లైన్ డెస్క్: కంటే కూతురినే కనాలి రా..మనసుంటే మగాడిలా పెంచాలి రా.. ఆ కవి ఊరికే రాయలేదు. సమాజంలో కూతురు వ్యాల్యూను ఈ పాట ద్వారా చాలా గొప్పగా చూపించాడు. అయితే ఈ పాటకు తగట్టు ఈ చిన్నారి తల్లి నిజ జీవితం ఉంది. ఎన్నో కష్టాలు అనుభవిస్తోంది. కన్న తండ్రికే తల్లిలా మారి సఫర్యాలు చేస్తూ కన్నీటి పర్యంతమవుతోంది. ఆదుకోవాలని తన చిన్నారి చేతులతో వేడుకుంటుంది.. మరి ఆ వివరాలు ఏంటో చూసేద్దాం..

సాధారణంగా చాలామంది కొడుకు కంటే, కూతుళ్ళకే ఎక్కువగా ప్రేమ ఉంటుందని అంటారు. అందులో ముఖ్యంగా తండ్రి మీద కూతురికే ఆప్యాయత ఎక్కువగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనం ఈ చిన్నారి తల్లి. ఈ తల్లి కష్టాలు వింటే ఎవరి మనసైనా కరుగక మానదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా నల్ల మాడకు చెందినటువంటి స్రవంతి(10) అనే అమ్మాయి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. తండ్రి కూలి పనికి వెళ్ళిన సమయంలో కింద పడితే నడుము విరిగిపోయింది. దీంతో తండ్రి మంచానికే పరిమితమయ్యాడు.

దీంతో ఆ చిన్నారి తల్లి తన తండ్రికి సఫర్యాలు చేసుకుంటూ తన చదువును కొనసాగిస్తూ అష్ట కష్టాలు పడుతోంది. కనీసం ఉండడానికి ఇల్లు, స్నానం చేయడానికి బాత్రూం కూడా లేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తోంది. చిన్న వర్షం పడితే ఆరోజు జాగరనే ఉండాలని కన్నీటి పర్యంతమవుతోంది. తండ్రి కనీసం లేచి ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. తండ్రిని అన్ని రకాలుగా చూసుకుంటూ తాను పాఠశాలకు వెళుతూ, తన గుడిసెకు వచ్చి కట్టెల పొయ్యి పై వంట చేసి తన తండ్రికి పెట్టి, తాను తినాలి.

చదువుకునే వయసులో ఆ చిన్నారి తల్లి సంసార బాధ్యతలు మోస్తూ దిక్కుతోచని స్థితిలో ఉంది. కనీసం బయటకు వెళ్దాం అంటే బాత్రూం లేక, వానొస్తే మొత్తం తడిచిపోయే పూరి గుడిసెలో కాలం వెల్లదీస్తోంది. క్షణక్షణం ఓ యుగంలా గడిపే ఆ చిన్నారి తల్లి పరిస్థితి చూస్తే ఎవరికైనా కన్నీరు రాక మానదు. తన తండ్రికి చేయలేక, చేతిలో చిల్లి గవ్వలేక చదువు కూడా మనేద్దం అనే పరిస్థితికి వచ్చింది. కనీసం ఒక బాత్రూమ్ అయినా కట్టియండి అంటూ బోరున వినిపిస్తోంది..

ఆ ఆడపిల్ల ఎన్ని ఇబ్బందులు పడితే బాత్రూమ్ అయినా కట్టించండి అని అడుగుతుంది అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. తాను పడ్డ కష్టం ఎలాంటి ఆడపిల్లకు రావద్దని కోరుకుంటుంది. తాను చదువుకొని పై స్థాయికి వెళ్లాలనుకుంటోంది. కానీ తన కష్టాలు చదువుకు దూరం చేసేలా కనిపిస్తున్నాయి. ఈ చిన్నారి స్రవంతి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటుంది. సాయం అందించాలని చేయి చాస్తోంది. చిన్నారి తల్లిని తలో చెయ్యేసి కాపాడదాం.. బంగారు భవిష్యత్తు ఇద్దాం..


పి. స్రవంతి..

బ్యాంక్ అకౌంట్ నెంబర్..91155144392..

ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ..
ఐఎఫ్ఎస్సి కోడ్: APGB0001014,

బ్రాంచ్: నల్లమడ , అనంతపూర్ జిల్లా..

Tags:
Next Story
Share it