Janasena : జనసేన 'గాజు గ్లాస్' గుర్తుపై రేపు వీడనున్న సస్పెన్స్!

జనసేన పార్టీ కి మరోసారి కామన్ సింబల్ గురించి తలనొప్పి మొదలైంది. ఎన్నికల సంఘం విధించిన నియమాల ప్రకారం గాజు గ్లాస్ గుర్తు ని జనసేన పార్టీ కి ఇవ్వకూడదని వేసిన పిటీషన్ పై నేడు హై కోర్టు లో విచారణ జరుగగా తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.

Janasena : జనసేన గాజు గ్లాస్ గుర్తుపై రేపు వీడనున్న సస్పెన్స్!
X

న్యూస్ లైన్ డెస్క్: జనసేన పార్టీ కి మరోసారి కామన్ సింబల్ గురించి తలనొప్పి మొదలైంది. ఎన్నికల సంఘం విధించిన నియమాల ప్రకారం గాజు గ్లాస్ గుర్తు ని జనసేన పార్టీ కి ఇవ్వకూడదని వేసిన పిటీషన్ పై నేడు హై కోర్టు లో విచారణ జరుగగా తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. రేపటికి తుది తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే గాజు గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం పరిగణించబడింది. 2019 ఎన్నికలలో ఒక పార్టీ గుర్తింపు సాధించాల్సిన ఓటు శాతం కానీ, సీట్లు కానీ జనసేన పార్టీ కి రాలేదు. అందుకే జనసేన పోటీ చెయ్యని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా గాజు గ్లాస్ గుర్తు మీద ఎవరైనా పోటీ చెయ్యొచ్చు. అలా జరిగితే కూటమి లో ఉన్న టీడీపీ, బీజేపీ పార్టీలకు ఘోరమైన నష్టం జరుగుతుంది.

అందుకే జనసేన తరుపున న్యాయవాదులు గాజు గ్లాస్ గుర్తు తమకే ఉంచాలని హై కోర్టులో పోరాడుతున్నారు. మరోపక్క గాజు గ్లాస్ ని ఫ్రీ సింబల్ గా ప్రకటించారు కాబట్టి, ఆ గుర్తుని తమకే ఇవ్వాలి అంటూ 'ప్రజా కాంగ్రెస్' పార్టీ హై కోర్టు ని డిమాండ్ చేస్తుంది. గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల సంఘం జనసేన పార్టీ కి గాజు గ్లాస్ గుర్తు మీదనే పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని జనసేన పార్టీ నాయకులూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫ్రీ సింబల్ గా ఉంటే మాత్రం జనసేన పార్టీ వేరే గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఉన్న సమయం లో గుర్తుని మారిస్తే జనసేన కి డిపాజిట్స్ దక్కడం కూడా కష్టమే.

Tags:
Next Story
Share it