Tdpjanasena : రేపే టీడీపీ - జనసేన రెండవ జాబితా..!

తెలుగు దేశం - జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేసి రెండు వారాలు దాటింది. తెలుగు దేశం పార్టీ నుండి 94 మంది అభ్యర్థులు, అలాగే జనసేన పార్టీ నుండి 5 మంది అభ్యర్థులను ప్రకటించారు.

Tdpjanasena : రేపే టీడీపీ - జనసేన రెండవ జాబితా..!
X

న్యూస్ లైన్, మంగళగిరి: తెలుగు దేశం - జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేసి రెండు వారాలు దాటింది. తెలుగు దేశం పార్టీ నుండి 94 మంది అభ్యర్థులు, అలాగే జనసేన పార్టీ నుండి 5 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇక తర్వాత మిగిలిన సీట్ల విషయం లో అనేక చర్చలు జరగడం, ఆ తర్వాత కొన్నాళ్ళకు బీజేపీ పార్టీ కూడా కూటమి లో చేతులు కలపడం కారణంగా జనసేన పార్టీ కి సీట్లు కుదించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తొలుత 24 సీట్స్ లో పోటీ చేయబోతున్నామని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీ పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానం ని బీజేపీ వాళ్లకి కేటాయించారు. దీంతో బీజేపీ పార్టీ 10 అసెంబ్లీ స్థానాల్లో, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఏయే స్థానాల్లో పోటీ చేయబోతున్నారో ఒక క్లారిటీ వచ్చింది కానీ, బీజేపీ అభ్యర్థుల విషయం లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే రేపు మాత్రం పవన్ కళ్యాణ్, చంద్రబాబు మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తన మంగళగిరి ఆఫీస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులను పిలిచి టికెట్స్ ఖరారు చేసారు.

Tags:
Next Story
Share it