TdpJanasena : మరో రెండు రోజుల్లో టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!

ఆంధ్ర ప్రదేశ్ లో కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికలు మరో మూడు వారాల్లో జరగనున్నాయి.

TdpJanasena : మరో రెండు రోజుల్లో టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!
X

న్యూస్ లైన్, పిఠాపురం: ఆంధ్ర ప్రదేశ్ లో కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికలు మరో మూడు వారాల్లో జరగనున్నాయి. వివిధ పార్టీల నుండి అభ్యర్థులు నామినేషన్స్ ప్రక్రియ కూడా ఒక్కొక్కరిగా పూర్తి చేస్తున్నారు. ఈ నెల 25 వ తారీఖున ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఇప్పటివరకు కూటమి నేతలు కానీ, సీఎం జగన్ కానీ అధికారికంగా మ్యానిఫెస్టో ని విడుదల చెయ్యలేదు. అసలు మ్యానిఫెస్టో ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా అందరిలో నెలకొన్నాయి. అయితే నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ పిఠాపురం లోని ఉప్పాడ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మరో రెండు రోజుల్లో టీడీపీ , జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడపిల్లలకు చదువుకోవడానికి 15 వేలు, ప్రతీ నెల వచ్చే సాధారణ పెన్షన్ ని 4000 కి పెంచి ఇస్తామని అనడం, అలాగే ప్రతీ ఏడాది ఇంటికి 3 గ్యాస్ సీలిండెర్స్ ఇస్తామని చెప్పడం, ఇవన్నీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రతీ మీటింగ్ లో చెప్తూనే ఉన్నారు. ఇవి కాకుండా మరికొన్ని భారీ హామీలతో రూపొందించిన మ్యానిఫెస్టో ని రెండు రోజుల్లో విడుదల చెయ్యనున్నారు.

Tags:
Next Story
Share it