Prajagalam : పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన నరేంద్ర మోడీ!

ఎన్నో ఆశలతో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో, అదే రకమైన అనుభూతి టీడీపీ, జనసేన శ్రేణుల్లో మిగిలించింది నిన్న జరిగిన 'ప్రజాగళం' సభ.

Prajagalam : పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లిన నరేంద్ర మోడీ!
X

న్యూస్ లైన్, చిలకలూరిపేట: ఎన్నో ఆశలతో నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో, అదే రకమైన అనుభూతి టీడీపీ, జనసేన శ్రేణుల్లో మిగిలించింది నిన్న జరిగిన 'ప్రజాగళం' సభ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన ఈ సభతో రాష్ట్రం లో కూటమి వేవ్ ఎవ్వరూ ఊహించని రీతి చేరుకుంటుందని అందరూ భావించారు. కానీ నారాలోకేష్ సారథ్యం లో అతి చెత్త మ్యానేజ్మెంట్, ఏర్పాట్లు కారణంగా నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయం లో అనే మార్లు మైక్ కట్ అయ్యింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశం లో ఇప్పటి వరకు ఎన్నో వేల మీటింగ్స్ పెట్టి ఉంటారు, కానీ ఒక్కటంటే ఒక్క మీటింగ్ లో కూడా ఇలా మైక్ కట్ అవ్వడం వంటి పరిస్థితులను చూడలేదు. కానీ నారాలోకేష్ పుణ్యామా అని అది చూడాల్సి వచ్చింది.

ప్రసంగిస్తున్న సమయం లో మాటికొస్తే మైక్ కట్ అవుతూ ఉండడం వల్ల ప్రధాని మోడీ కి చిరాకు కలిగింది. ఎల్లప్పుడూ ప్రత్యర్థుల మీద జోకులు, ఛలోక్తులు, చమత్కారాలతో సాగే మోడీ ప్రసంగం నిన్న సభలో అత్యంత సాదాసీదాగా జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముఖాలలో జోష్ మిస్ అయ్యింది. సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని వాళ్లకు అప్పటికే అర్థం అయ్యినట్టు వాళ్ళ ముఖాలు చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని గెలిపించామని మోడీ తన ప్రసంగం లో ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన ప్రసంగం అంతా లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది. కేంద్రంలో తమకు 400 సీట్లు ఇవ్వండి అని కోరారు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం టిడిపీ,జనసేన శ్రేణులను పూర్తిగా నిస్తేజంలోకి నెట్టేసింది. అలా కూటమికి ఎక్కడలేని జోష్ తెస్తుందని ఆశించిన చంద్రబాబు, పవన్ అశలపై చిలకూలూరిపేట సభ నీళ్ళు జల్లింది.

Tags:
Next Story
Share it