Tdp-Janasena : ఈ నెల 3వ వారం లో టీడీపీ - జనసేన అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల!

జనవరి 16 వ తారీఖున టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Tdp-Janasena : ఈ నెల 3వ వారం లో టీడీపీ - జనసేన అభ్యర్థుల మొదటి లిస్ట్ విడుదల!
X

Newsline, Amaravati: సరిగ్గా మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థుల జాబితాని రెండు విడతలుగా విడుదల చేసేసింది. ఇక ఇప్పుడు అందరి చూపు టీడీపీ- జనసేన అభ్యర్థుల జాబితా మీదనే ఉంది. కేవలం ఈ ఇరువురి పార్టీల అభిమానులు మరియు క్యాడర్ తో పాటుగా, వైసీపీ క్యాడర్ కూడా టీడీపీ - జనసేన అభ్యర్థుల లిస్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. సంక్రాంతి పండగ నాడు అభ్యర్థుల జాబితా బయటకి వస్తుందని ఇది వరకే నాదెండ్ల మనోహర్ పలు సందర్భాల్లో తెలిపాడు. ఇప్పుడు మూడవ వారం లో కచ్చితంగా అభ్యర్థుల జాబితా విడుదల చేయబోతున్నాం అని టీడీపీ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. జనవరి 12 లేదా 13వ తారీఖులలో టీడీపీ - జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే బయటకి రానుంది.

అలాగే జనవరి 16 వ తారీఖున టీడీపీ - జనసేన కి సంబంధించి మొదటి విడత అభ్యర్థుల జాబితాని విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం. ఈ జాబితాలో టీడీపీ నుండి 60 మంది అభ్యర్థుల లిస్ట్, అలాగే జనసేన నుండి 23 మంది అభ్యర్థుల లిస్ట్ విడుదల కాబోతుంది అట. అందుతున్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ టీడీపీ ని 70 సీట్లు డిమాండ్ చేసిందని, చివరకి 50 స్థానాలకు ఒప్పందం కుదిరిందని టాక్. మూడు విడతల వారీగా జాబితా ని విడుదల చెయ్యబోతున్నారు. జనసేన అభ్యర్థుల జాబితా కూడా మూడు విడతల్లో రాబోతుంది. ఒక్కసారి అభ్యర్థుల జాబితాని ప్రకటించిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్ర ని ప్రారంభిస్తాడని అంటున్నారు.

Tags:
Next Story
Share it