New Delhi : అమిత్ షా కాళ్ళు మొక్కిన చంద్రబాబు!

బీజేపీ పార్టీ తో పొత్తు కోసం చర్చలు జరిపేందుకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ కి పయనమైన సంగతి అందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ కి చేరుకున్నాడు. అమిత్ షా ని కలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆయన కాళ్లకు మొక్కినట్టుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది

New Delhi : అమిత్ షా కాళ్ళు మొక్కిన చంద్రబాబు!
X

న్యూస్ లైన్, న్యూ ఢిల్లీ : బీజేపీ పార్టీ తో పొత్తు కోసం చర్చలు జరిపేందుకు తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ కి పయనమైన సంగతి అందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే ఆయన ఢిల్లీ కి చేరుకున్నాడు. అమిత్ షా ని కలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు ఆయన కాళ్లకు మొక్కినట్టుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి తెగ వైరల్ గా మారింది. అయితే ఇది నిజం ఫోటో అనుకొని చాలా మంది షేర్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి అది మార్ఫ్ చెయ్యబడ్డ ఫోటో అట. వైసీపీ పార్టీ అభిమానులు ఈ పని చేసి ఉంటారని టీడీపీ పార్టీ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ, ఇప్పుడు బీజేపీ పార్టీ తో కూడా జతకలవడానికి సిద్ధమైంది. పొత్తులో భాగంగా బీజేపీ కి 8 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలను ఇవ్వడానికి చంద్రబాబు అంగీకారం తెలిపినట్టు సమాచారం.

Tags:
Next Story
Share it