Prajagalam : ఫ్లాప్ గా నిల్చిన ప్రజాగళం సభ.. నిరాశపర్చిన మోడీ ప్రసంగం!

టీడీపీ , జనసేన పార్టీలు పట్టుబట్టి బీజేపీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు కలయిక తర్వాత మొట్టమొదటిసారి చిలకలూరిపేట లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసారు.

Prajagalam : ఫ్లాప్ గా నిల్చిన ప్రజాగళం సభ.. నిరాశపర్చిన మోడీ ప్రసంగం!
X

న్యూస్ లైన్, చిలకలూరిపేట : టీడీపీ , జనసేన పార్టీలు పట్టుబట్టి బీజేపీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురు కలయిక తర్వాత మొట్టమొదటిసారి చిలకలూరిపేట లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసారు. ఈ సభకి టీడీపీ, జనసేన నాయకులు భారీ గానే జనసమీకరణ చేసారు. పైగా ఈ మీటింగ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తారు అని తెలియడం కచ్చితంగా రాష్ట్రానికి మేలు చేసే పధకాలు ఏమైనా చెప్తారేమో , స్పెషల్ స్టేటస్, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ తదితర అంశాల మీద ఏమైనా కీలక ప్రకటన చేస్తారేమో అని ఆశపడ్డారు. అవేమి జరగలేదు.పవన్ కళ్యాణ్, చంద్రబాబు తమ సమయాన్ని మొత్తం మోడీ కి భజన చెయ్యడానికే కేటాయించారు. ఇక మోడీ నుండి ఒక్కటంటే ఒక్క హామీ కూడా రాలేదు. అసలు ఏమి మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదు. అలా ఎన్నో భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ సభ అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సభని చూసిన తర్వాత ఇక నుండి ఇలాంటి పెద్ద మీటింగ్స్ కి మోడీ ని పిలవకండి అంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు.

Tags:
Next Story
Share it