TdpJanasena : టీడీపీ జనసేన మొదటి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ వచ్చేసింది!

నేడు ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసం కి చేరుకోగా, ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ ద్వారా ఈ అభ్యర్థుల జాబితా ని విడుదల చేసారు. మొదటి విడతగా విడుదలైన ఈ జాబితా లో తెలుగు దేశం పార్టీ 94 సీట్లు, అలాగే జనసేన పార్టీ 24 సీట్లలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

TdpJanasena : టీడీపీ జనసేన మొదటి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ వచ్చేసింది!
X

న్యూస్ లైన్, అమరావతి : కోట్లాది మంది అభిమానులు, కార్తకర్తలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న టీడీపీ - జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా నేడు విడుదల అయ్యింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సందర్భంలో ఒక పక్క వైసీపీ పార్టీ అభ్యర్థుల జాబితాలను విడుదల చేసుకుంటూ పొతుంతే, టీడీపీ జనసేన మాత్రం స్తబ్దుగా ఉందని ఇరువురి పార్టీల అభిమానుల్లో ఆందోళన ఉండేది. ఆ ఆందోళన నేటితో తెర పడింది. ఇప్పుడు విడుదల అయ్యింది ఇరువురి పార్టీల అభ్యర్థుల జాబితా కాదు, రాబొయ్యే ఎన్నికలలో గెలబొయ్యే అభ్యర్థుల జాబితా అని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నేడు ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసం కి చేరుకోగా, ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ ద్వారా ఈ అభ్యర్థుల జాబితా ని విడుదల చేసారు. మొదటి విడతగా విడుదలైన ఈ జాబితా లో తెలుగు దేశం పార్టీ 94 సీట్లు, అలాగే జనసేన పార్టీ 24 సీట్లలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇందులో పవన్ కళ్యాణ్ భీమవరం స్థానం నుండి పోటీ చేస్తుండగా, నాదెండ్ల మనోహర్ తెనాలి నుండి, కొణతాల సీతారాం అనకాపల్లి నుండి, కాకినాడ రూరల్ నుండి పంతం నానాజీ తదితరుల పేర్లు ప్రకటించారు. అయితే ఈ 24 స్థానాలు మొదటి జాబితా కి సంబంధించిందా, లేదా మొత్తం 175 నియోజకవర్గాలకు సమందించిందా అనేది తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it